RRB: పారా మెడిక‌ల్ కొత్త షెడ్యూల్ విడుద‌ల‌...! 7 d ago

featured-image

భార‌త రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పారా మెడిక‌ల్ (CEN 03/2025) పోస్టుల ప‌రీక్షల‌ను మార్చి 11 నుంచి 13 వ‌ర‌కు నిర్వ‌హిస్తున్నారు. పాత షెడ్యూల్ ప్ర‌కారం మార్చి 10 నుంచి 12 తేదీ అని ప్ర‌క‌టించినా తాజాగా ఈ ప‌రీక్ష‌ల‌ను మార్చి 11, 12, 13వ‌ తేదీల‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా దేశ వ్యాప్తంగా వివిధ కేట‌గిరీల్లో 434 పోస్టుల‌కు ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. సీబీటీ ప‌రీక్ష‌, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్‌, మెడిక‌ల్ టెస్టుల ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది. ప‌రీక్ష‌కు 10 రోజుల ముందు సిటీ ఇంటిమేష‌న్ స్లిప్పుల‌ను, 4 రోజుల ముందు అడ్మిట్ కార్డుల‌ను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుప‌ర‌చ‌నున్న‌ట్లు ఆర్ఆర్‌బీ తెలిపింది. పూర్తివివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD